19 August, 2026 | 4:01 PM

కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి అభినందనలు

15-06-2024 10:40 AM

అమరావతి: తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణతేజ ఎంపిక సంతోషమని పవన్ కల్యాణ్ అన్నారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగాలు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పవన్ కొనియాడారు. బాలల హక్కుల పరిరక్షణకు కృష్ణతేజ ఉత్తమ విధానాలు అనుసరించారని తెలిపారు. కరోనా కష్టకాలంలో, కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణతేజ సేవలు ప్రజలు మరిచిపోలేదని వ్యాఖ్యానించారు.