19 August, 2026 | 4:48 PM

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

15-06-2024 09:40 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచిఉన్నారు. శుక్రవారం 66,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించారు.  36,229 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.3.71 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.