19 August, 2026 | 4:34 PM

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

19-08-2026 03:59 PM

కొమరవెల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం రిలే  నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాడూరి రవీందర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 51 ని సవరించి, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్బర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. వారికిచ్చే   కనీస వేతనాన్ని 26 వేలకు పెంచాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు అరవింద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.