19 May, 2026 | 10:14 AM

రామాయణకు డబ్బింగ్ చెప్పదట!

19-05-2026 12:00 AM

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’లో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సాయిపల్లవి పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్టును వినియోగించాలని నిర్ణయించారట మేకర్స్. సాయిపల్లవి హిందీలో తొలిసారి నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. ఇం దులో జునైద్‌ఖాన్ సరసన నటించింది సాయిపల్లవి. ఇటీవలే విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఈ చిత్రంలో సాయిపల్లవి హిందీ డైలాగ్ డెలివరీ, ఆమె స్లాంగ్‌పై నెటిజన్ల నుంచి కొంత విమర్శలొచ్చాయి. ఇక ‘రామాయణ’ పౌరాణిక చిత్రం. ఇందులో భాష చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. కాబట్టి సాయిపల్లవి హిందీ యాస సీత పాత్రలోని దైవత్వానికి లేదా గాంభీర్యానికి సరిపోకపోవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారని టాక్. అయితే, సాయిపల్లవి తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది.

కానీ, సినిమా నాణ్యత, పాత్ర స్వభావాన్ని దృష్టిలో ఉం చుకుని మేకర్స్ తీసుకున్ని తాజా నిర్ణయం సాయిపల్లవికి షాక్ ఇచ్చినట్టేనని చెప్పాలి. మరో విషయం ఏంటం టే.. తన పాత్రకు మ రొకరితో డబ్బింగ్ చెప్పించేందుకు సాయిపల్లవి కూడా అంగీకరిం చిందట. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్ర పోషిస్తుండగా, యష్ రావణుడిగా,  సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ భారీ చిత్రం తొలిభాగం దీపా వళి కానుకగా విడుదల కానుంది.