నిజాన్ని నిర్భయంగా చెప్పడం నేరమా
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నిజాలు నిప్పుల కొలిమిలా రాస్తున్న విజయక్రాంతి పత్రికా విలేఖరి ఉప్పులేటి లక్ష్మణ్ ఇంటి విద్యుత్ కనెక్షన్ కట్ చేసిన సింగరేణి యాజమాన్యం కక్ష సాధింపు చర్యలను తెలంగాణ ఉద్యమకారుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. ఈమేరకు ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఎల్తూరి శంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను అధికారుల కుంభకోణాలను నిర్భయంగా నిజాయితీగా తన కలం ద్వారా సమాజం దృష్టికి తీసుకు రావడం ఆయన చేసిన నేరమా అని ప్రశ్నించారు.
ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయనపై అగ్ర కులానికి చెందిన మందమర్రి ఏరియా ఉన్నత అధికారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గంమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉన్నత అధికారుల నియంత పోకడలను సహించేదిలేదన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు,రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు,దళిత సంఘాలు, ట్రేడ్ యూనియన్ లు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.






