29 July, 2026 | 4:25 PM

పరవళ్లు తొక్కుతున్న గుండాల జలపాతం

29-07-2026 03:51 PM

 150 అడుగుల ఎత్తు  జలధార

ఆసిఫాబాద్(విజయక్రాంతి):  ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని ప్రసిద్ధ గుండాల జలపాతం భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా కొండ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో సుమారు 150 అడుగుల ఎత్తు నుంచి జలపాతం ఉధృతంగా కిందికి దూకుతూ కనువిందు చేస్తోంది.పెరిగిన నీటి ప్రవాహంతో జలపాతం పరిసర ప్రాంతాలు ప్రకృతి సోయగాలతో కళకళలాడుతున్నాయి. జలపాతం అందాలను తిలకించేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నప్పటికీ, భారీ వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నందున జలపాతం సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సందర్శకులు భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.