వాచ్ మెన్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం
09-08-2026 02:53 PM
బేల, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ ( kgbv ) లో ఖాళీగా ఉన్న నైట్ వాచ్మెన్ పోస్ట్ భర్తీకి మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు మండల విద్యాధికారి మహాలక్ష్మి తెలిపారు. 10వ తరగతి మెరిట్, రోస్టర్ పాయింట్, ఓపెన్ కీటగిరిలో ఉన్న ఈ పోస్టులు కేవలం ఎస్సీ ( గ్రూప్ 2) మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 12లోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు






