9 August, 2026 | 4:09 PM

గౌడ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ

09-08-2026 02:54 PM

పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం ఆగ్రోస్ చైర్మన్ కాసుల...

బాన్సువాడ, ఆగస్టు 9 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ బోనాల వేడుకల్లో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో పాటు మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు.

ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  ఈ కార్యక్రమంలో. సొసైటీ చైర్మన్ ఏర్వల కృష్ణారెడ్డి, గురు వినయ్  ఎజాజ్. రవీందర్ రెడ్డి గోపాల్ రెడ్డి  గౌడ సంఘం సభ్యులు జీడిపల్లి నర్సాగౌడ్, యాదగిరి గౌడ్, రాజా గౌడ్ శేఖర్ గౌడ్ మెరుపుల శ్రీనివాస్ గౌడ్ . వేణు గౌడ్. బండి శీను గౌడ్ పెద్ద బండి శీను గౌడ్ సాయ గౌడ్ నరేష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.