పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ లో ట్రేడ్స్‌లలో స్వల్ప కాలిక శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి
పెద్దపల్లి, మార్చి 05 (విజయ క్రాంతి): పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ లో PMKVY (ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన) క్రింద ఈ క్రింద తెలుపబడిన ట్రేడ్స్‌లలో స్వల్ప కాలిక శిక్షణకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1).సి.ఎన్.సి ఆపరేటర్ (విఎంసి)
2). ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ లీడ్ టెక్నీషియన్
3) త్రీడి ప్రింటింగ్ ఆపరేటర్ పైన తెలుపబడిన స్వల్ప కాలిక ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింద తెలుపబడిన ధ్రువపత్రాల ప్రతులతో పాటు బయోడేటా సమర్పించాలని కోరారు.
విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు,
కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్
తాజా ఫోటోలు 02, కావున ఆసక్తి గల అభ్యర్థులు పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.(6303662956 , 8500467552)
గమనిక:
PMKVY ట్రైనింగ్ కొరకు Enrollment & Online Apply చేయుటకు చివరి తేది 06 -03-2026 కలదని,
క్లాసులు ప్రారంభం తేది 07 -03-2026.
-Aadhaar, Enabled, Biometric, Attendance తప్పనిసరని ప్రిన్సిపాల్? తెలిపారు.




