ఖమ్మంపల్లి-ముత్తారం ప్రధాన రహదారిపై అదుపుతప్పిన బైక్
ఇరువురికి తీవ్ర గాయాలు సకాలంలో 108 లో తరలింపు
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కాల్వపల్లికి వివాహ కార్యక్రమానికి వెళుతుండగా అడవి శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సందరెల్లి సమీపంలో పామ్ ఆయిల్ తోట మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం గురువారం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పరుశగట్టు (28), ముంజం దేవేందర్ (31) పరుశగట్టుకు తలకు తీవ్ర గాయాలు కాగా, దేవేందర్ కు కుడి చేయి విరిగింది. పొలంలో పనిచేస్తున్న రైతులు గమనించి వెంటనే 108 సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వారిరువురిని మంథని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొరకు గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలట్ హబీబ్ అహ్మదులకు గాయపడ్డ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




