24 August, 2026 | 11:43 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

24-08-2026 09:31 PM

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

ప్రజావాణి కార్యక్రమానికి 27 దరఖాస్తులు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ​సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 27  దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ​ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా పరిష్కరించి పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఒ వసంత కుమారి, ఆర్డీఒ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.