25 August, 2026 | 12:56 AM

చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి

24-08-2026 11:03 PM

బిక్కనూర్,(విజయ క్రాంతి): బిక్కనూర్ గ్రామానికి చెందిన జీపీ వర్కర్‌ ఊరే ప్రభాకర్‌ (49) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామంలోని వీధి దీపాలు వేసేందుకు వెళ్లిన ప్రభాకర్‌ అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బొబ్బిలి చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఊరే కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బిక్కనూర్‌ ఎస్‌ఐ ఎస్‌.అనిల్‌ తెలిపారు.