25 August, 2026 | 4:44 AM

రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్

24-08-2026 11:07 PM

– ఘనంగా స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు

– పినపాక, మణుగూరు మండలాల్లో భారీ బైక్ ర్యాలీ

– అక్రమ కేసులకు భయపడేది లేదు: రేగా కాంతారావు

మణుగూరు,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు నాయకులు,కార్యకర్తలు, మహిళ నాయకురాలు, ఘనంగా స్వాగతం పలికారు. పినపాక, మణుగూరు కార్యకర్తలు పినపాక మండలంలోని దుగినేపల్లి  పంచాయతీలోని  రెడ్డిగూడెం ప్రధాన రహదారిపై వందలాది బండ్లతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ అట్టహాసంగా స్వాగతం పలికారు. మహిళా నాయకులు హారతి ఇచ్చి పూలమాల వేశారు.

అక్కడనుండి మణుగూరు మండలానికి చేరుకున్నారు. మణుగూరు లోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుతంత్రాలు చేసినా భయపడేది లేదని అన్నారు. ప్రభుత్వ పథకాలపై అమలు చేయాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులకు కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడుతున్నారని తెలిపారు.

రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నికల సమయంలో ఓటుతో తగిన బుద్ధి చెప్తారని, అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా  ఎగరడం ఖాయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనతో కార్యకర్తల్లో జోష్ నింపింది.  ఈ కార్యక్రమంలో పినపాక మండ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ప్రధానకార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, మాజీఎంపీపీ గుమ్మడి గాంధీ,మాజీ వైస్ ఎంపీపీ దాట్ల వాసు బాబు, సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఎంపిటిసి కాయం శేఖర్, మణుగూరు మాజీ జెడ్పిటిసి పోశం  నరసింహారావు, నాయకులు అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, వట్టం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.