విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ఇన్‌చార్జిల నియామకం

05-05-2024 01:37:41 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి): మహానగరంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులకు సర్కిళ్లకు ఇన్‌చార్జిలను నియమిస్తున్నట్లు ఎస్‌పీడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫరూఖీ శనివారం ఉత్తర్వ్యులు జారీ చేశారు. విద్యుత్ సరఫరా నిర్వహణను పటిష్టవంతంగా చేపట్టేందుకు సీఎండి ముషారఫ్ ఫరూఖీ గ్రేటర్‌లోని సర్కిళ్ల వారీగా సీజీఎం స్థాయి అధికారులను సూపర్‌వైజింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు బంజారాహిల్స్, సికింద్రాబాద్, వికారాబాద్ సర్కిళ్లకు కె. రాములు, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు కె. సుధామాధురి, రాజేంద్రనగర్‌కు మురళీకృష్ణ, సైబర్‌సిటీ, సరూర్ నగర్‌లకు శివాజీ, గద్వాల్, వనపర్తి సర్కిళ్లకు రంగనాథ్‌రాయ్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణ్‌పేట్ సర్కిళ్లకు పాండ్య, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ సర్కిళ్లకు నందకుమార్, నల్గొండ, హైదరాబాద్ సౌత్ సర్కిళ్లకు కృష్ణారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి సర్కిళ్లకు సీహెచ్ చక్రపాణిలను నియమించారు. వీరితో పాటు ఆయా సర్కిళ్లలో డివిజన్లు, సబ్ డివిజన్లను పర్యవేక్షణ చేసేందుకు 54 మంది డీఈలు, 55మంది ఏడీఈలు, 82మంది ఏఈలకు పలు ప్రాంతాల్లో బాధ్యతలను అప్పగించారు.