8 August, 2026 | 9:47 AM

షాద్‌నగర్ నియోజకవర్గంలో సింగిల్ విండో చైర్మన్ల నియామకం

08-08-2026 08:43 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్మానం

​షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల సింగిల్ విండో సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం పూర్తయింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన చైర్మన్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.చేగురు సొసైటీ పసుల బుచ్చయ్య, ​నందిగామ మండలం సింగిల్ విండో కుందారం వెంకటరెడ్డి, ​మేకగూడ సొసైటీ అంబటి ప్రభాకర్, ​కొందుర్గు మండలం జితేందర్ రెడ్డి, ​కేశంపేట్ మండలం యన్నం శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సమర్థులైన నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించింది. నూతన చైర్మన్లు సహకార సంఘాల అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు.​నియోజకవర్గంలోని అన్ని సహకార సంఘాలకు చైర్మన్ల నియామకం పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.