చేర్యాల మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత మృతి
08-08-2026 09:03 AM
చేర్యాల, ఆగస్టు 07: గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆకునూరు గ్రామానికి చెందిన చేర్యాల మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత(44) శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.2014లో బీఆర్ఎస్ పార్టీ నుండి జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందిన ఆమె, 2019 వరకు జడ్పీటీసీ గా ఉండి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు.ఆమె మృతి వార్తతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు సంతాపం తెలిపారు.ఆమెకు భర్త చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.






