8 August, 2026 | 9:41 AM

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు, పోస్టర్లు అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలి

08-08-2026 09:09 AM

బాన్సువాడలో డి.ఎస్.పి, పట్టణ సిఐ కి బిజెపి ఆధ్వర్యంలో వినతి...

బాన్సువాడ,(విజయ క్రాంతి): ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టే విధంగా పోస్టర్లను పెట్టడం  ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, సీఐ తుల శ్రీధర్ లకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చిత్రపటంపై  స్టిక్కర్స్ అతికించడం. దేశ యువతపై పెడదారి పట్టే విధంగా తప్పుడు ప్రకటనలు చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిందని దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని దేశ యువత ప్రజలు తప్పుడు ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని.. తప్పుడు ప్రకటన చేసిన స్టిక్కర్ కనిపించిన వారిపై కఠిన మైన చర్యలు పోలీస్ శాఖకు కొరడం జరిగింది .లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన  కార్యక్రమాలు చేపడుతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడుగుట్ల శ్రీనివాస్ అందే చిరంజీవి వంకారు ఉమేష్ సచిన్ యాదవ్ చీకట్ల రాజు సాయి రెడ్డి పురుషోత్తం భూమేష్ మహేందర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.