3 June, 2026 | 1:27 AM

నెట్ బౌలర్‌గా ఆకిబ్ నబీ

03-06-2026 12:54 AM

మరో ఐదుగురికి కూడా పిలుపు

ముంబై, జూన్ 2: భారత టెస్ట్ జట్టులోకి దేశవాళీ క్రికెట్ ప్రదర్శన ప్రామాణికం కాద నే విషయం మరోసారి రుజువైంది. ఆప్ఘనిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికవని ఆకీబ్ నబీ రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాంటి బౌలర్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా అతన్ని పక్కనపెట్టి పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేయడం మరింత చర్చనీయాంశంమైంది. దీంతో కాస్త ఆలోచించిన బీసీసీఐ ఆకీబ్ నబీని నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది.

అతనితో పాటు మరో ఐదుగురు బౌలర్లను కూడా నెట్స్‌లో సేవలందిం చేందుకు తీసుకుంది. వీరిలో కొందరు ఐపీఎల్ 2026లో సత్తా చాటిన బౌలర్లు.  గుర్జ ప్నీత్ సింగ్, ఆకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, సరా న్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ కో సం భారత జట్టు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. వీరు ప్రధాన జట్టులో సభ్యులు కాకపోయినా, భారత బ్యాటర్లకు నెట్ ప్రాక్టీస్‌లో సహాయపడతారు. వీరిని ఎంపిక చేయ డం వెనుక ఐపీఎల్ 2026 వల్ల రెగ్యులర్ బౌలర్లపై పడిన శారీరక ఒత్తిడి కారణమని తెలుస్తోంది.

ఫైనల్ వరకు ఆడిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ రెగ్యులర్ జట్టు సభ్యులుగా ఉన్నప్పటికీ శారీరక అలసట కారణంగా ప్రాక్టీస్ సెషన్స్‌కు అందుబా టులో ఉండటం లేదు. దీంతో బ్యాటర్లకు స రైన ప్రాక్టీస్ కల్పించేందుకు అదనపు బౌలర్లను ఎంపిక చేశారు. భారత టెస్టు జట్టు ప్ర స్తుతం మార్పుల దశలో ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బౌలర్లను దగ్గరగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.