15 June, 2026 | 8:18 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

సింధు శుభారంభం

03-06-2026 12:57 AM

మాళవిక, శ్రీకాంత్ ఔట్

ఇండోనేషియా ఓపెన్

జకార్తా, జూన్ 2: ఇండోనేషియా ఓపెన్ సూపర్ -1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భార త స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 25 21- బుసానన్(థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో సింధు తన ప్రత్యర్థిపై ఆ ధిపత్యం కనబరిచింది. 

తొలి గేమ్ హోరాహోరీగా సాగినప్పటికీ, రెండో గేమ్‌లో మా త్రం సింధు తనలోని ఆటను బయటికి తీసి విజయాన్ని అందుకుంది. అయితే రెండో రౌండ్‌లో హైదరాబాదీ ప్లేయర్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది.  ప్రపంచ నంబర్ వన్ యాన్ సే యంగ్‌ను సింధు ఎదుర్కోనుంది. గతవారం సింగపూర్ ఓపెన్‌లో యా న్ సే చేతిలో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది.  అలాగే మరో ప్లేయర్ మాళవిక బన్సోద్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మాళవిక బన్సోద్ 12-10 స్కోరుతో ఏడో సీడ్ చోచువాంగ్ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో  కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.