రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ ఆక్వా రంగం: సీఎం చంద్రబాబు
ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
విజయవాడ: జిఎఫ్‌ఎస్‌టి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఆక్వా టెక్ 2.0 కాన్ క్లేవ్ (Aqua Tech 2.0 Conclave)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పాల్గొన్నారు. ఆక్వా రంగం.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగంతో 30 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతిసాగు ఆక్వా ఉత్పత్తులకు(AQUA Products) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని సీబీఎన్(CBN) సూచించారు. సీడ్, ఫీడ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి.. యాంటీబయోటిక్స్ ను తగ్గించాలని సీఎం చంద్రబాబు(Chandrababu) సూచించారు. ఆక్వారంగం.. 10 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం దిశగా ప్రోత్సహిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కాలుష్యం లేని ఆక్వా దిశగా రైతులు, వ్యాపారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.




