5 August, 2026 | 10:55 AM

ఆదిత్య పాఠశాలకు ఎంఈఓ నోటీసులు జారీ

05-08-2026 09:54 AM

డిఈఓ ఆదేశాలతో కదిలిన విద్యాశాఖ

మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశం

బాన్సువాడ, ఆగస్టు 5 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ సాయి కృప నగర్ కాలనీలో కొనసాగుతున్న ఆదిత్య పాఠశాలకు డిఈఓ మల్లికార్జున్ ఆదేశాలతో బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు నోటీసులు జారీ చేశారు. డిఈఓ ఆదేశాలతో కదిలిన విద్యాశాఖ అధికారులు. బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో అనుమతులు తీసుకొని సాయి కృపా నగర్ కాలనీలో పాఠశాలను ఏ విధంగా కొనసాగిస్తారని మూడు రోజుల్లోగా వివరాలు సమాధానంతో సమర్పించాలని నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ నాగేశ్వరరావు విజయ క్రాంతి తో తెలిపారు. రెండు మూడు రోజుల్లో గా శ్రీ చైతన్య పాఠశాల నివేదిక అనంతరం,పాఠశాల యాజమాన్యం ఇచ్చే నివేదిక ప్రకారం పరిశీలించి చర్యలు ఉంటాయని ఎంఈఓ తెలిపారు.