5 August, 2026 | 10:51 AM

రైతన్న కన్నీటి బాధకు కరుణించిన వరుడు

05-08-2026 09:43 AM

కోదాడ, (విజయక్రాంతి): కోదాడ మండలంలో రాత్రి పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది వర్షం కారణంగా రామలక్ష్మపురం బీకియా తండ గ్రామాల మధ్యన వాగు పొంగిపొర్లుతున్నది గత మూడు నెలలుగా రైతన్నలు వర్షాల కోసం ఎదురుచూస్తూ కృష్ణా బేసిక్ లో వర్షాలు లేక ఉన్న కొద్దిపాటి వనరులతో బోర్లు బావుల కింద వరి సాగుచేస్తూ పడుతున్న ఇబ్బందులు వర్ణుడు తలవంచక తప్పలేదు ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి మంగళవారం మాట్లాడుతూ రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి రైతులు ఆనందముతో వరి నాట్లు వేస్తూ దుక్కులు దున్నే పనులు ఊపందుకున్నాయి రైతులు ఆనంద వ్యక్తం చేస్తూ కరెంటుతో  ఇబ్బందులు పడుతూ రాత్రి కురిసిన వర్షం కొంతమేర ఉపశమనం కలిగించింది అట్లాగే కృష్ణా బేసిక్ లోని ఆల్మట్టి నారాయణపూర్ జూరాల నిండుకుండలా ఉండటం శ్రీశైలానికి భారీగా వరద వస్తుందంటూ నాగార్జునసాగర్ ఎడమ కాలవ రైతులు నీటిపై ఆశలు చిగురుస్తున్నాయి నారుమల్లు సిద్ధం చేసుకున్న రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఈ ఖరీఫ్ ను గట్టి ఎక్కించేందుకు ప్రణాళికలు తయారు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగినది.