5 August, 2026 | 10:46 AM

వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 37వ రోజు నిరసన

05-08-2026 09:41 AM

 గణపురం,(విజయక్రాంతి): కాకతీయ థర్మల్ పవర్  ప్లాంట్ ప్రధాన గేటు వద్ద టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో వైటీపీఎస్ ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ ప్రైవేటీకరణ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం 37వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడాలని, శాశ్వత ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా 

నాయకులు మాట్లాడుతూ, వైటీపీఎస్ ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ ప్రైవేటీకరణ టెండర్‌ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీపీఈజేఏసీ నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు.