21 March, 2026 | 2:36 PM

అనుమతుల పేరిట ఇష్టారాజ్యంగా మట్టి రవాణా

21-03-2026 12:06 AM

బెజ్జంకి,మార్చి20 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, పూర్తి వివ రాల లేవు అని స్థానికుల్లో అనుమానాలకుతీస్తోంది. సర్వే నంబర్.209 పట్టా భూమిలో 0.081 హెక్టార్ల పరిధిలో 800 మెట్రిక్ టన్నుల మట్టి/గ్రావెల్ తవ్వకానికి 10 రోజులపాటు తాత్కాలిక అనుమతి మంజూరు చేసినట్లు అధికారిక పత్రాలు తెలియజేస్తున్నాయి.

ఈ అనుమతిలో పత్రాలలోమట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఏ పనికోసం ఉపయోగిస్తున్నారు అనే కీలక అంశాలపై స్పష్టత లేకపోవడం గమనార్హం.800 మెట్రిక్ టన్నుల మట్టిని తరలిం చాలంటే ట్రాక్టర్లటిప్పర్ల ద్వారా ఎన్ని అవసరం అవుతాయి. ఒక వాహనం రోజుకు చేయగలదు,నిర్ణీతరోజులలో ఈ పని పూర్తి చేయాలంటేవాహనాలు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది అని స్పష్టత లేదని స్థాని కుల నుండి ఆరోపణలు వెళ్ళు వెత్తున్నాయి .

గ్రామంలో కనిపిస్తున్న వాహనాల రాకపోకలు, వాహనాల నెంబర్లు వాటి సంఖ్య పై స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళ ల్లో కూడా ట్రాక్టర్ల రాకపోకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్మిషన్ ఉందని చెబుతున్నా మట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎంత వరకు తవ్వుతున్నారు అన్నది తెలియడం లేదు. రాత్రివేళల్లో కూడా వాహనాలు తిరుగుతున్నాయి,అని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

800 MT మాత్రమే అనుమతి ఉంటే ఇన్ని ట్రిప్స్ మట్టి ఎలా తియ్యటంజరుగుతున్నాయి అని అం టున్నారు,మండల కేంద్రం లో నుండే రవా ణా కొనసాగుతుంటే ఆధికారులు ఒకసారి వచ్చి పరిశీలించాలి అని మరికొందరు కోరుతున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికా రులను సంప్రదించగా పర్మిషన్ నిబంధనల ప్రకారం మాత్రమే తవ్వకాలు జరగాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అయినప్పటికీ మట్టి తరలింపు గమ్యం, ఉపయోగం, వాహనాల సంఖ్య వంటి అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల పర్మిషన్ పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మట్టి తవ్వకాలపై పూర్తి పారదర్శకత పాటించాలని, అనుమతి వివరాలు బహిరంగంగా ప్రకటించాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధిక లోడ్ తో వెళ్ళటం వల్ల రొడ్డులు అన్ని చెడిపోవడం జరుగుతుంది,

మట్టి రవాణావాహనాలు అధిక వేగం తో వెళ్ళటం తో ఎక్కడనుండి ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. గతంలో ఇలాగే మట్టి రవా ణా చేస్తున్న వాహనం ఢీకొని ఒక యువకు డు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండలలో చోటు చేసుకుంది దీని పై అధికారులు వెంటనే స్పందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.మట్టి అనుమతుల పేరిట ఇష్టారాజ్యంగా మట్టి రవాణా జరుగుతుంది అని స్థానిక బాహాటంగానే అంటున్నారు.ఇది ఇలా వుండగా కొంత మంది అధికారులు స్థానిక నాయకుల కనుసన్నల్లోనే జారుతున్నాయి అని స్థానికులు ము చ్చటిస్తున్నారు.

దొంతరవేణి మహేష్... గ్రామస్తుడు...

మట్టి రవాణాపై పర్మిషన్ ఉందా అని ప్రశ్నించిగాఅక్రమ మట్టి రవాణాదారుడు దురుసుగా స్పందించారు. మట్టి రవాణా దారుడు. మీరు ఎవరికైనా చెప్పుకోండి., నాకు జిల్లా అధికారుల నుండి అనుమతి ఉంది, అంటూ అతడు గర్వంగా సమాధానం ఇవ్వటం జరిగింది.ఇంకా ముందుకు , మా బండ్లు ఎవరైనా పట్టుకున్నా, గ్రామ పంచాయతీ వాళ్లే విడిపించి తీసుకువస్తారు.అంటూ సవాల్ విసరటం జరిగింది. అక్రమ మట్టి రవాణా జరుగుతుందనే అనుమానాల మధ్య, ప్రశ్నించిన వారిని బెదిరిం చేలా మాట్లాడటం అధికార యంత్రాంగంపై కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా 

సంబంధిత అధికారులు స్పందించకపోవటం సరికాదు తహశీల్దార్ శ్రీకాంత్ మైనింగ్ జియాలజీ శాఖ నుండి పర్మిషన్ ఉంది. అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు మా వద్ద లేవు.