సవరణలతోరిజర్వేషన్లు సాధ్యమా?
డాక్టర్ తిరునహరి శేషు :
స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేష న్లు కల్పించడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి రాష్ర్ట ప్రభుత్వం 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 285 (ఏ) క్లాజ్ కి ప్రతిపాదించిన సవరణ బిల్లుని తెలంగాణ రాష్ర్ట శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మిం చరాదనే 285 (ఏ) క్లాజ్ ని ఎత్తి వేయటం ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తుంది.
అయితే ఈ సవరణ బిల్లుపై గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఈ సవరణ బిల్లు న్యాయ సమీక్ష ముందు నిలబడుతుందా! హైకోర్టు ఆదేశాల మేర కు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా! అనే అంశం రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని 285 (ఏ) క్లాజ్ కి ప్రతిపాదించిన సవరణ బిల్లుని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలనే నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదిస్తారా! ఒకవేళ ఆమోదించినా 42 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయా అన్న సం దేహాలు కూడా కలుగుతున్నాయి.
రాష్ర్ట ప్రభుత్వం పంపిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై రాష్ర్టపతి నిర్ణయంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం మరొక ప్రత్యామ్నాయంగా క్యాబినెట్ ఆమోదంతో 285 (ఏ) క్లాజ్ కి సవరణలు ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్ కి పంపారు.. కానీ గవర్నర్ ఆ సవరణ ప్రతిపాదనలపై ఆర్డినెన్స్ నిర్ణయం తీసు కోవడానికి న్యాయ సలహా కోసం కేంద్ర హోం శాఖకు పంపించారు. గవర్నర్ నిర్ణయం తీసుకుని బిల్లును ఆమోదించినా రిజర్వేషన్ల అమలు సాధ్యపడకపోవచ్చు.
న్యాయస్థానంలో నిలబడేనా?
అయితే 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తంగా 61 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించిన బిల్లును నాటి గవర్నర్ నర సింహన్ ఆమోదించినా ఆ బిల్లు న్యాయ సమీక్ష ముందు నిలబడలేదు. తెలంగాణ హైకోర్టు సహా సుప్రీంకోర్టు జోక్యం వల్ల 61 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. చివరకు రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనలతో.. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం, బీసీలకు 23 శాతం.. మొత్తంగా 50 శాతం రిజర్వేషన్లతో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బి ల్లుని గవర్నర్ ఆమోదించినా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయటం దాదాపు అసాధ్యమే అనిపిస్తుంది. సవరణ బిల్లుకి గవర్నర్ ఆమోద ముద్ర వేసినా ఆ బిల్లులో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటిన నేపథ్యంలో ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముంది. విచారణ సందర్భంగా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల పరిమి తిని ఎత్తేశారు? పరిమితిని ఎత్తేసే అధికారం ఒక రాష్ర్ట ప్రభుత్వానికి ఉంటుందా? అనే ప్రశ్నలకు రాష్ర్ట ప్ర భుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలంటే ముందుగా 243 (డి)(టి) ఆర్టికల్‌తో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన 1994 చట్టానికి సవరణలు ప్రతిపాదించాలి. అలాగే ట్రిపుల్ టెస్ట్ ఆధా రంగానే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాలనే 2010 సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష జరగాలి. అప్పుడే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయగలుగుతారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసే అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశం కాదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు న్యాయ స్థానం ముందు నిలబడకపోవచ్చు.
అసెంబ్లీలో ఆమోదముద్ర
ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలక సవరణ బిల్లులకు రాష్ర్ట అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వా దోపవాదాల నడుమనే తెలంగాణ మున్సిపాలిటీల (మూడవ సవరణ) బి ల్లు తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు-2025లను సభ వాయిస్ ఓటు ద్వా రా ఆమోదించింది.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముం దుగా మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లు, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లులకు కూడా శాసనసభ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ర్టంలో స్థానికంగా జరిగే ఎన్నికలపై ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఎన్నికలు వాయిదానేనా?
సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున సవరణ బిల్లుని గవర్నర్ ఆమోదించకపోతే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరే అవకాశం ఉంది. ఒకవేళ సవరణ బిల్లును గవర్నర్ ఆమోది ంచినా ఎవరైనా బిల్లుపై న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తే ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు మెండు. సవరణ బిల్లు ఆమో దం పొందినా, పొందకపోయినా.. ఎన్నికలు వాయిదా వేసుకోవటానికి రాష్ర్ట ప్రభుత్వానికి సవరణ బిల్లు అందివచ్చిన అవకాశంలా కనిపిస్తుంది.
ప్రభుత్వం కూడా ఎన్నికలు వాయిదా పడాలనే కోరుకుంటుంది. ఒక బిల్లుపై గవర్నర్ లేదా రాష్ర్టపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సవరణ బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసే అవకాశముం ది.
చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే ఈ సమస్యను కూడా ఎదుర్కోటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలనుకుంటుంది. పార్టీపరంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ రాష్ట్రంలోని 566 జెడ్పీటీసీలకు గాను 237 స్థానాలను .. 5,773 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,424 ఎంపీటీసీ స్థానాలను బీసీ వర్గాలకి కేటాయించి మాట నిలబెట్టుకున్నామని చెప్పటానికే రాష్ర్ట ప్రభుత్వం ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిపాదిస్తుంది.
ఏది ఏమైనా విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించటం ఒక సుదీర్ఘమైన చట్ట న్యాయ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని బద్దలు కొట్టినప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవు తుంది. కాబట్టి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్ల సాధనకి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స మన్వయంతో పనిచేసి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877






