calender_icon.png 12 September, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సద్గుణాల సారమే ‘మిలాద్-ఉన్-నబి’

04-09-2025 12:00:00 AM

‘మిలాద్--ఉన్--నబి’ అనేది ప్రవక్త మహమ్మద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే ఇస్లా మిక్ పర్వదినం. ఈ పండుగను ముస్లింలు ప్రవక్త పట్ల గల ప్రేమ, గౌరవానికి ప్రతికగా జరుపుకుంటారు. మిలాద్-ఉన్-నబి అనేది రబీ అల్ అన్వ ల్ నెలలో 12వ తేదీన జరుపు కుంటారు. ఇది ఇస్లామిక్ చంద్ర మాన పంచాంగం జరుపుకొనే ముఖ్యమైన పండుగ. ప్రవక్త బోధనలు జీవన విధానం గురించి ప్రసంగాలు, ప్రార్థనలు, మతపరమైన సమావేశాలు నిర్వహిస్తారు.

త్యాగం, కరుణ, సత్య, నిష్ఠ వంటి గుణాలను గుర్తు చేస్తుంది. క్రీస్తు శకం 750లో మక్కా నగరంలో ఈ సంవత్సరాన్ని అమ్--అల్-ఫిదాల్ ఏనుగుల సంత్సరంగా పిలుస్తారు. మక్కా చివరి ప్రవక్త ఖాతిమ్-ఉన్-నబీ-వాన్ ఫాతిమీ కాలమైన 11వ శతాబ్దంలో ఈ ఉత్సవం ప్రారంభం అయింది.  సున్నీలు, షియాలు వేరు వేరుగా ప్రార్థనలు చేస్తారు.

ఇక రబీ-ఉల్-అవ్వాల్  17వ రోజున నిర్వహిస్తారు. ఆ రోజు ఇమామ్ జాఫర్ సాధిక్ పుట్టిన రోజు. షియాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, ప్రవక్త జీవిత చరిత్ర విన్నపాలు చదివి వినిపిస్తారు. సున్నీలు 12న  రబీ--ఉల్-అవ్వాల్‌ను జరుపు కుంటారు. వారు మసీదుల్లో ఖురాన్ పఠనం, నాథ్ షరీఫ్ ప్రవక్తను స్తుతించే పాటలు పడుతారు. మసీదులను అలంకరణ చేసి దీపాలు వెలి గించి ఊరేగింపులు నిర్వహిస్తారు. 

 ఉమాశేషారావు, కరీంనగర్