18 July, 2026 | 11:59 AM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

ఇసుక బస్తాలే శాశ్వత పరిష్కారమా...?

29-05-2026 02:19 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి సమీపంలో వాగుపై నిర్మించిన కాలవ వంతెన (అక్విడక్ట్) వద్ద గతేడాది జూన్, జులైలో కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకుపోయి కుంగిపోయింది. దీంతో కాలవ నీరు భూములకు వెళ్లకుండా నేరుగా వాగులోకి వెళ్లి వృథాగా పోయింది. అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా మట్టి పోసి ఇసుక బస్తాలు అడ్డుగా పెట్టి చేతులు దులుపుకొన్నారు. ఇది ఇలాగే ఉంటే వర్షాకాలంలో మరోసారి తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని కోరుతున్నారు.