18 July, 2026 | 12:27 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

కుక్కల దాడిలో ఐదు మేకపోతులు మృతి

29-05-2026 01:23 PM

ఆదుకోవాలని బాధితుడి విన్నపం

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ బర్కత్పురా కాలనీ చెందిన మజార్ అనే వ్యక్తికి చెందిన ఐదు మేకలను కుక్కలు దాడి చేసి చంపేసినట్లు బాధితులు మజార్ తెలిపారు. బక్రీద్ రోజున అర్ధరాత్రి తన ఇంట్లో ఉన్న మేకపోతులను కుక్కలు దాడి చేసి చంపేసినట్లు బాధితుడు లబోదిబోమన్నాడు. సుమారు 60000 నష్టం వాటిల్లిందని కుక్కలను అరికట్టడంలో మున్సిపాలిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బాధితులు గోడువెల్లబోసుకున్నాడు. తనను ఆదుకోవాలని విన్నవించారు.