5 September, 2026 | 7:03 AM

ఒవైసీ సోదరులు దేశభక్తులా?

05-09-2026 | 05:10am
  1. అసెంబ్లీలో వందేమాతర గేయాన్ని ఆలపించారా?
  2. ఒక్క ఎంఐఎం ఎమ్మెల్యే అయినా నిలబడ్డాడా?
  3. మోదీ, అమిత్‌షాలతో వారిని పోల్చడమా!
  4. అలా ఎందుకన్నారో రాహుల్, రేవంతే చెప్పాలి
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): వందేమాతరం(Vande Mataram) గేయాన్ని గౌరవిం చని వారిని దేశభక్తులుగా కీర్తించడం అవివేకమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(N Ramchandra Rao) విమర్శించారు. ఓట్ల కోసం అలాంటి వారిని పొగడడం ఆశ్చ ర్యం కలిగిస్తున్నదన్నారు.  ఒవైసీ సోదరులపై(Owaisi brothers) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రశంసలు కురిపించడాన్ని ఆక్షేపించారు. శుక్రవారం రాంచందర్‌రావు(Ramchandra Rao) యశోద ఆస్పత్రి(Yashoda Hospital)లో చికిత్సపొందుతున్న బీజేపీ నేత నాగం వర్ధిత్‌రెడ్డి తల్లిని పరామర్శించారు. 

అనంతరం బ యటకు వచ్చిన ఆయన మీడియాతో మా ట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ(Assembly)లో వందేమాతరం ఆలపిస్తుంటే ఒక్క ఎంఐఎం ఎ మ్మెల్యేనైనా లేచి నిలబడలేదని అసహనం వ్యక్తం చేశారు. దేశభక్తి అంటే జాతీయ జెం డా, జాతీయ గేయాలను గౌరవించడమని పేర్కొన్నారు. దేశభక్తులు అంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలే అని, అలాంటి మహోన్నతులతో ఒవై సీ సోదరులను పోల్చడం సరికాదన్నారు.

అసలు ఏ అర్హత చూసి ఒవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారో రాహుల్, రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో 15 నిమిషాలు పోలీసులను పక్కకు జరిపితే దేశంలో ఎవరేంటో తెలుస్తుందని బెదిరించినందుకా? బహిరంగంగా తాము ఆవు మాంసం తింటాం, గో మాంసం బాగుంటుందనే ఒవైసీ సోదరుల మాటలను మెచ్చుకుని వారికి దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారా? అంటూ మండిపడ్డా రు. మీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 

వందేమాతరం పాడి నిరూపించుకోవాలి

దేశభక్తి అంటే దేశాన్ని ఒకటిగా కలిపే జాతీయ జెండాకు, జాతీయ గీతానికి, జాతీ య గేయానికి మర్యాద ఇవ్వడమని రాం చందర్‌రావు గుర్తుచేశారు. రాహుల్ గాంధీ కి పాకిస్తాన్, చైనాలపై ఎలాంటి పేట్రియాటిజం ఉందో, అదే పేట్రియాటిజం ఈ ఒవై సీలకు కూడా ఉందని.. రేవంత్ రెడ్డి భావిస్తున్నారేమోనని విమర్శించారు.

మోదీ, అమిత్ షాకు దేశభక్తి ఉందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నందుకు సంతోషమని, కానీ ఒవైసీలకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడం మాత్రం ఈ దేశంలో ప్రతి ఒక్కరినీ ఘోరంగా అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా దేశభక్తి ఉంటే ముందుగా సభల్లో పూర్తిగా వందేమాతరం పాడి నిరూపించుకోవాలని అన్నారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు