గిరిజనులు కంటికి కనిపించడం లేదా?: శ్రీనివాస్ గౌడ్
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ లోనే అభివృద్ధి
ఎక్కడ ఆపిన పనులు అక్కడే ఆగిపోయాయి
మీ సమయం దగ్గర పడుతుంది... మంచి పనులు చేయండి
ప్రజా సమస్య లపై అలుపుఎరుగని పోరాటం చేస్తాం
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : గిరిజనులుకు మంచి చేయడమే ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అన్నాడు రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. గిరిజనులను ఎక్కడ కు పోయిన కింద కూర్చోబెట్టేవరని విమర్శలు హైదరాబాద్ బంజార భవనం ఏర్పాటు చేయమని తెలిపారు. సర్పంచ్ సంతకం కోసం ఊరు ఊరు గిరిజనులు తిరిగిన రోజులకు ముగింపు పలికి బీఆర్ఎస్ అద్భుతం పథకాలను చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4483 గ్రామపంచాయతీ లు చేస్తే వీటి లో 3146 గిరిజన తండాలు గ్రామ పంచాయతీ లను చేయడం జరిగిందన్నారు. దీంతో 31వేల మంది గిరిజనులు ప్రజాప్రతినిధులు అయ్యారని తెలిపారు. గిరిజనుల మేలు కోసం భవనలతో, వసతి గృహలను నిర్మాణం చేయడం జరిగిందన్నారు.
నియోజకవర్గం లో ఆదివాసులకు ఇండ్లు నిర్మించెందుకు రూ 25 కోట్లు నిదులు సమాకూర్చి కోట్ల రూపాయలు ఆస్తులను తయారు చేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర వచ్చినప్పట్టి నుంచి గిరిజనులకు మంచి చేయలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వంలకు రాలేదన్నారు. వేలాది మంది గిరిజన నాయకులు తయారు అయ్యారంటే కెసిఆర్ కే సాధ్యం కావడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం లో గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తెలియజేస్తారని పేర్కొన్నారు. వెంకబడిన కులాలకు మంత్రి పదవులు ఇవ్వలేదని విమర్శలు చేశారు.
ఇచ్చిన హామీ లను నెరవేర్చంత వరకు గిరిజనులు వెంట పడుతారని పేర్కొన్నారు. ఎరుకల కులానికి కేటాయించిన 2 ఎకరాలు భూమి వారికి ఇవ్వాలని, అధికారులు నిర్లక్ష్యం చేయకూడని పేర్కొన్నారు. ప్రతి తండా లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నో పనులను చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని అసహనం వ్యక్తం చేశారు. వారి మేలు కోసం తప్ప వారు ఏ పనులు చేయరని అసహనం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ అమలు అయ్యేలా మన అందరం ఆందోళన లు చేయవసిన అవసరం ఉందన్నారు. నాడు అమరరాజా కంపెనీ అప్పుడు బాగాలేదని, ఇప్పుడు అద్భుతంమని సిఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారని చెప్పారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రతాప్ నాయక్, వల్య నాయక్, రవీందర్, సూర్య, గిరిజనులు ఉన్నారు