భూకొనపల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క
కామారెడ్డి,సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో ఉన్న భూకొనపల్లి ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. మంగళవారం కామారెడ్డి మండలం సారంపల్లి శివారులోనిపల్లి అంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. బుక్కోనిపల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆలయాల అభివృద్ధి,భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.మంజూరైన నిధులతో ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జైహి రాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజగౌడ్, కృష్ణారావు, సొసైటీ చైర్మన్లు గూడెం శ్రీనివాస్ రెడ్డి,..
ఇంద్రకరణ్ రెడ్డి, భీంరెడ్డి, సుధాకర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ గంగాధర్ రావు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, కౌన్సిలర్లు అంజాద్, మజీద్, వాజీద్, జావీద్, సత్యం, చిట్టీబాబు, మహేష్, లడ్డు, కో-ఆప్షన్ మెంబర్ అలీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుట్నాల శ్రీను యాదవ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుమాల రమేష్ , సీనియర్ నాయకులు పండ్ల రాజు, భిక్కనూర్ సర్పంచ్ బల్యాల రేఖ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, గంప ప్రసాద్, తిరుమల స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, లక్ష్మి, సుతారి రమేష్, యాదవరెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.