గిరిజన, ఆదివాసీల సంక్షేమం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది

15-09-2026 | 04:00pm

బిఆర్ ఎస్ నాయకులు రాథోడ్ రాము నాయక్

ఖానాపూర్( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీల సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసులను పట్టించుకోవడంలేదని అప్పటి తమ ప్రభుత్వం లోనే గిరిజనులకు ఆరు శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచి సంక్షేమం అందించిన విషయం గిరిజనులు గుర్తుంచుకోవాలని ఆ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి రాథోడ్ రాము నాయక్ అన్నారు.

ఈ మేరకు రిజర్వేషన్ పెంచి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‎లో మంగళవారం ఆ పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కౌన్సిలర్ తొడసం ఇందిరా నాయకులు వాల్ సింగ్, వసంత్ నాయక్, పలువురు గిరిజన నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు