17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

స్వీట్లు తింటున్నారా?

13-04-2025 12:00 AM

మనలో కొందరికి రాత్రి భోజనం చేసిన తర్వాత స్వీట్లు, కేక్స్, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లలో ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. ఇది మానుకోవాలి అనుకున్నా కొందరు బయటపడలేరు. అయితే రాత్రి డిన్నర్ చేశాక స్వీట్లు తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..

* రాత్రి భోజనం తర్వాత స్వీట్లను ఎక్కువగా తింటే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. 

* రాత్రిపూట చక్కెరతో చేసిన పదార్థాలు తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. 

* స్వీట్లు తిని పడుకోవడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. దంతాలకు రక్షణగా నిలిచే ఎనామిల్ క్షీణిస్తుంది. కొన్నిసార్లు పిప్పళ్లు కూడా ఏర్పడతాయి. అలాగే నోటి దుర్వాసనకు కారణమవుతుంది. 

* అందుకే రాత్రివేళ చక్కెరతో చేసిన స్వీట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. పగలైనా సరే చక్కెరతో చేసిన పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవడమే అన్ని విధాల మంచిది.