విద్యుత్ షాక్ తో లైన్ మెన్ మృతి
24-06-2026 10:37 AM
జనగామ, జూన్ 24 (విజయక్రాంతి): జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున విద్యుత్ ట్రాన్స్ఫర్ వద్ద తనిఖీ చేస్తుండగా లైన్మెన్ రాధ మల్ల కరుణాకర్ రెడ్డి కరెంట్ షాకుకు గురై మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యను పరిశీలించేందుకు స్తంభం ఎక్కిన ఆయన ప్రమాదవశాస్తూ కిందకి పడిపోయాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






