24 June, 2026 | 12:48 PM

తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో ప్రమాదంలో ప్రజారోగ్యం

24-06-2026 11:42 AM

అధికారులు వెంటనే స్పందించాలి

మధిర,జూన్24(విజయక్రాంతి): మధిర పట్టణంలోని అగ్రికల్చర్ ఫారం రోడ్డులో మున్సిపాలిటీ వాటర్ సప్లై మెయిన్ లైన్ లీక్ అవుతోంది. ఈ పైప్‌లైన్ పూర్తిగా డ్రైనేజీ నీటిలో మునిగి ఉండటంతో కలుషిత నీరు తాగునీటిలో కలిసే ప్రమాదం ఉంది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారకముందే సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.