calender_icon.png 11 February, 2026 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం

11-02-2026 12:32:20 AM

  1. 65 వార్డులు, 131 పోలింగ్ కేంద్రాలు

పటిష్ట బందోబస్తు ఏర్పాటు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు 

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా

నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు అధికార యంత్రాంగం  ఏర్పాట్లు సిద్ధం చేసింది. కల్వకుర్తిలో 22, కొల్లాపూర్ 19,  నాగర్ క ర్నూల్ 24 వార్డుల వారిగా 65 వార్డులకు గాను 131 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశా రు. నాగర్ కర్నూల్ 102 మంది, కల్వకుర్తిలో 81మంది, కొల్లాపూర్ లో 60 మొత్తం 243 మంది అభ్యర్థులు భరిలో నిలిచారు.

ఉద యం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియ సజావుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పో లింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్,  ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.  ఎన్నికల నిర్వహణ కోసం 629 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలతో పాటు వివిధ బాధ్యతలతో 2 వేల మందికి పైగా ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.

మూడు విడుతల ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు పూర్తయ్యిందన్నారు.ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్2 రిటర్నింగ్ అధికారులకు మూడు విడుతలలో శిక్షణ అందించినట్లు తెలిపారు.  పోలింగ్ కేంద్రాల్లో సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

మూడు మున్సిపాలిటీలకు 131 మంది పీఓలు, ఓపీఓలు, రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 17,460 మంది పురుషులు, 17,918 మంది మహిళలు మొ త్తం 35,378 మంది ఓటర్లు ఉన్నారు.

కల్వకుర్తిలో 12,981 మంది పురుషులు,  13, 053 మంది మహిళలు, మొత్తం 26,034 మంది ఓటర్లు ఉన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 9,663 మంది పురుషులు, 9, 807 మంది మహిళలు మొత్తం 19,470 మంది చొప్పున మూడు మున్సిపాలిటీల్లో 40,104 మంది పురుషులు, 40,778 మం ది మహిళలు మొత్తం 80,882 మంది ఓట ర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

పోలింగ్ ప్రక్రి యను వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టరేట్తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి నేరుగా వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.