16 April, 2026 | 4:12 PM

Breaking News

నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి   •   ప్రజా పాలన మండల స్థాయి సమావేశం   •   సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు   •   సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం   •   మహిళా రిజర్వేషన్ బిల్లు— ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక   •   డీలిమిటేషన్, సవరణ బిల్లులపై ప్రతిపక్షాల నిరసన.. లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం   •   మున్సిపల్‌లో పైసల పంచాయతీ   •   మహిళా కోటా బిల్లుపై వాడివేడి చర్చ.. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకు?   •   మార్కుల విషయంలో నిరాశ.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య   •  

ఎల్లారం జాతరకు ఏర్పాట్లు సిద్ధం

03-02-2026 12:33 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మత్తడి స్వింగానకట్ట సమీపంలో ఎల్లారం పోచమ్మ అమ్మవారి జాతర(yellaramma jatara) ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అడవిలో వెలసిన అతి పురాతనమైన ఎల్లారం పోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు రెండోసారి ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈనెల 4 తేదీ, అఖండ జ్యోతి ప్రజ్వలన ఉదయం 9 గంటలకు ఇందిరానగర్ మహంకాళి దేవాలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి, సత్యనారాయణ శాస్త్రి, దీకొండ అశోక్ చారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తేదీన ఉదయం 11 గంటలకు అమ్మవారికి బోనాల సమర్పణ, అనంతరం అమ్మవారికి మొక్కల చెల్లింపు కార్యక్రమాలు ఉంటుందని ఆలయ కమిటీ అధ్యక్షులు జిల్లాల సుధాకర్ గౌడ్ తెలిపారు. కావున భక్తులు పెద్ద ఎత్తున హాజరై జాతర,బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు.