కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు అరెస్ట్ వారెంట్..
బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు భారీ షాక్ తగిలింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో యడ్యూరప్ప విచారణకు హాజరుకాకపోవడంతో బెంగళూరు కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత కొన్నిరోజుల క్రితం ఓ మహిళ చీటింగ్ కేసులో సహయం కోరేందుకు యడ్యూరప్ప దగ్గరకు వెళ్లితే తన 17 ఏళ్ల కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాని సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో యడ్యూరప్పపై లైంగిక వేధింపుల, పోక్సో చట్టం కింద కేసులు నమోదుయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులను సీఐడీ విచారిస్తోంది.
ఈ నేపథ్యంలోనే సీఐడీ విచారణకు హాజరు కావాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, యుడ్యూరప్ప ఈ ఆరోపణలను ఖండిస్తూ.. తాను న్యాయపరంగా పోరాడతానని, విచారణకు సహకరిస్తానని, పస్తుతం తాను ఢిల్లిలో ఉన్నాను, విచారణకు హాజరుకావాడానిక మరింత గడువు కావాలని కోరుతు సీఐడీకి లేఖ రాశారు. ఈ కేసుపై రేపు విచారణ జరుగనుంది. ఈ సందర్భంగా కర్ణాటక హోమంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ... అవసరమైతే యడ్యూరప్పను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.






