22 August, 2026 | 9:48 PM

తెలంగాణ లాసెట్‌, పీజీ లా సెట్‌ ఫలితాలు విడుదల

13-06-2024 05:00 PM

హైదరాబాద్‌: తెలంగాణ లాసెట్‌, పీజీలా సెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి లాసెట్‌, పీజీలాసెట్‌ ఫలితాలు ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్ఎల్ఎం పరీక్ష కోసం 4,408 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 29,258 మంది (72.66 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. టీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలో 120 మార్కులకు గాను 42 మార్కులు, టీజీ పీజీ ఎల్ సెట్ ప్రవేశ పరీక్షలో 120 మార్కులకు గాను 30 అర్హత మార్కులగా నిర్ణయించారు.