రాష్ట్రంలో మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాట్లపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవత్ రెడ్డి ఆదేశాలననుసరించి రెండేళ్లలో 150 మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కలెక్టరేట్లు, బస్లాండ్ లు, పారిశ్రామిక, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామని, బెంగాల్ లో దీదీ కా రసోయ్, కేరళలో అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేసినట్లు ఆమె వెల్లడించారు. మహళ శక్తి క్యాంటీన్ల సర్వీసులపై వివిధ శాఖలపై సీఎస్ శాంతి కుమారి సమీక్షించారు. మహళ శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.






