సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు
జవహర్ నగర్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం
జవహర్ నగర్,(విజయక్రాంతి): సమ్మె విరమిస్తున్నాం యధావిధిగా పనులు కొనసాగుతాయని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు. సెంట్రింగ్ మేస్త్రీల అహంకార వ్యాఖ్యలను నిరసిస్తూ బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాపీ మేస్త్రీలు గత కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెను సోమవారం విరమిస్తున్నామని భవన నిర్మాణాంగాల కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ తాపీ మేస్త్రీల బంధం విడదీయ రానిదని పేదలపై ఆర్థిక భారం మోపకుండా అడ్డగోలుగా రేట్లను పెంచడం తగదని అన్నారు. కార్మికుల సంక్షేమంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పేర్కొన్నారు. తాపీ మేస్త్రీల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.






