2 August, 2026 | 1:48 AM

ఆంధ్రాలో సువర్ణాధ్యాయం

02-08-2026 12:52 AM
  1. ఉత్తరాంధ్ర గేమ్‌చేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ 
  2. ప్రధాని నరేంద్ర మోదీ
  3. సీఎం చంద్రబాబుతో కలిసి విమానాశ్రయం జాతికి అంకితం
  4.   18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం

అమరావతి, ఆగస్టు ౧: ‘ఆంధ్రప్రదేశ్ సువర్ణాధ్యాయం మొదలైందని, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యానికి మరో ముందడుగు పడిందని ప్ర ధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో ని ర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా రూ.18వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని ప్రారంభించారు. సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారి కృపతో ఉత్తరాంధ్రకు మహ ర్దశ వచ్చిందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఈ ప్రాంతం ప్రగతి బాట పట్టనుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టులను అభివృద్ధిచేస్తున్నామని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల విలువైన పనులు జరుగతున్నాయని స్పష్టం చేశా రు. క్రమ క్రమంగా రాష్ట్రం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీ మారుతున్నదని అంచనా వేశారు. గతంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒక కుటుంబం పేర్లే ఉండేవని, యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కానీ, తమ ప్రభుత్వం అలా కాదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వ చ్చాక అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకి పేరు, పంజాబ్‌లో నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌కు సంత్ రవిదాస్ పేరు పెట్టామని గుర్తుచేశారు.

2014కు ముందు భారత్‌లో 74 వి మానాశ్రయాలే ఉండేవని, తాము అధికారం వచ్చాక 12 ఏళ్లలో 166 పెరిగాయన్నా రు. తద్వారా సామాన్యులకు విమాన ప్ర యాణాన్ని చేరువ చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ నజీర్ పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర దశ మారనుంది: సీఎం చంద్రబాబు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర దశ పూర్తిగా మారనుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎయి ర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని భావోద్వేగానికి గుర య్యారు. ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబో తున్నాయని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలు సాకారం: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

ప్రధాని మోదీ సారథ్యంలో 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కొని యాడారు. దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే కీలకమని ప్రధానికి తెలుసు కాబట్టే అభివృద్ధి సాధ్యమవుతున్నదని కీర్తించారు. తనను దూషించే వారిని కూడా క్షమించే గు ణం మోదీదని శ్లాఘించారు. మోదీ లాంటి ప్రధాని దేశానికి ఉండటం దేశ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.

థింసా నృత్యం.. అదుర్స్

ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసి న ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది.ప్రధానికి ఏకంగా 13 వేల మంది గిరిజన కళాకారులు థింసా నృత్యం చేస్తూ స్వాగతం పలికారు. ఈప్రదర్శన సరికొత్త రికార్డులు సృష్టించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించింది. ప్రదర్శనకు ప్రధాని మంత్రముగ్ధులయ్యారు.