2 August, 2026 | 1:49 AM

నన్ను క్షమించండి మోదీజీ

02-08-2026 12:42 AM
  1. ఒత్తిడి, తప్పుదోవ పట్టించడంవల్లే అనుచిత వ్యాఖ్యలు
  2. క్షమించరాని నేరమే అయినా క్షమించాలని విజ్ఞప్తి
  3.   15 ఏళ్ల బాలిక వీడియో విడుదల

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ‘నన్ను క్షమించండి.. నిరసనకారుల ఒత్తిడి, తప్పుదోవ పట్టించడం వల్లే ప్రదాని మోదీపై అనుచిత వ్యాఖ్య లు చేశా. తనకి కేవలం 15 ఏళ్లు. తాను చేసిం ది క్షమించరాని తప్పే అయినా ఇదే నా మొదటి, చివరి తప్పుగా భావించి క్షమించాలి’ అని ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక విజ్ఞప్తి చేసింది. ఆ బాలిక శనివారం వీడియో విడుదల చేసి తన ఆవేదనను బహిర్గతం చేసింది.

వీడియో వెలుగులోకి రాగానే బాలికను క్షమిస్తారా? అంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ఆ బాలికపై జూలై 30న నోయిడా లో కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

జంతర్‌మంతర్ నిరసనల్లో తనను, తన తల్లిని దూషించిన పిల్లలను క్షమించానని అన్నారు. చిన్నతనంలో తప్పులు జరు గుతాయని, దారి తప్పిన పిల్లలకు సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వారికి సరైన మార్గాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను వారిని క్షమించానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.