27 June, 2026 | 2:20 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

ఐసీసీ అవార్డుకు అర్ష్‌దీప్ నామినేట్

30-12-2024 01:24 AM

దుబాయ్: భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ ఐసీసీ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ సీజన్‌లో భారత్ గెలిచిన అన్ని టీ20 మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ కీలకపాత్ర పోషించాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజం, కంగారూ బ్యాటర్ ట్రావిస్ హెడ్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజాతో అర్ష్‌దీప్ పోటీపడనున్నాడు. ఈ ఏడాదిలో 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన సింగ్ 36 వికెట్లు నేల కూల్చాడు. విజేత ఎవరనేది 2025 జనవరిలో ప్రకటించనున్నారు. 

రేసులో మంధాన కూడా.. 

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. ఇక ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు వనిందు హసరంగ (శ్రీలంక), మెండిస్ (శ్రీలంక), ఒమర్జాయ్ (అఫ్ఘనిస్తాన్), రూథర్‌ఫర్డ్ (వెస్టిండీస్) నామినేట్ అయ్యారు. ఐసీసీ మహిళల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఆటపట్టు (శ్రీలంక), కెర్ (న్యూజిలాండ్), ప్రెండెర్‌గాస్ట్ (ఐర్లాండ్), లారా (సౌతాఫ్రికా)నామినేట్ అయ్యారు.