27 June, 2026 | 2:13 PM

ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు

27-06-2026 01:38 PM

అశ్వాపురం, జూన్ 27 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటరేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మాజీ సర్పంచ్ కమటం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఆయన నివాసంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మొండికుంట గ్రామపంచాయతీలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేని విధంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా అవగాహన కల్పించాలని బీఎల్‌వోలకు సూచించారు.