3 August, 2026 | 3:23 AM

ఘనంగా ఆషాఢ మాసం బోనాలు

03-08-2026 02:00 AM

మేడ్చల్ అర్బ న్, ఆగస్టు 2 (విజయ క్రాంతి): మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి పరిధిలో ఆషాడ మాసం బోనా లు అంగరంగ వైభవంగా నిర్వహించారు.  కండ్లకోయ పట్టణంలోని పెద్దమ్మ గుడికి ప్రజలందరూ బోనాలతో వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నరేందర్ రెడ్డి, స్వామి, రవీందర్ గౌడ్ , మాజీ కౌన్సిలర్ క్రిష్ణ గౌడ్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్, రాజేందర్, వెంకటేష్, శ్రీనివాస్, ప్రభాకర్, వీరాస్వామి, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.