3 August, 2026 | 3:31 AM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు

03-08-2026 02:45 AM

చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలో ఘటన

ముషీరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): చిక్కడపల్లిలోని సిటీ సెంటర్ లైబ్రరీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశా యి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామక పరీక్షల దరఖాస్తు ఫీజులను పెంచడాన్ని నిరసిస్తూ ఆదివారం నిరుద్యోగులు తమ ఆవేదనను పోస్టర్ల రూపంలో వ్యక్తం చేశారు. పోస్టర్లలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను ఉంచి, ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ దరఖాస్తులకు ఫీజు వసూలు చేయబోమని పేర్కొన్నప్పటికీ, ప్రస్తుతం ఫీజులను పెంచ డం అన్యాయమని అభ్యంతరం వ్యక్తం చేశా రు.

నిరుద్యోగ జేఏసీ నేతలు శంకర్ నాయక్, నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు, పోస్టుల సంఖ్య, వయోపరిమితి పెంపుపై చర్యలు తీసుకోకుండా దరఖాస్తు ఫీజులు మాత్రమే పెంచి నిరుద్యోగులపై భారం మోపుతోందని విమర్శించా రు. ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలను అమలు చేయాలని, లేదంటే నిరుద్యో గులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారన్నారు.