27 June, 2026 | 6:21 AM

నిరంతరం ప్రజా సేవలో ఉండాలి

09-05-2026 08:35 PM

మాజీ మంత్రి జోగు రామన్న పిలుపు

ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్‌కు ఘన సన్మానం

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జోగు రామన్నను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో జోగు రామన్న ఎండీ అహ్మద్‌ ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిరంతరం ప్రజా సేవలో ముందుండాలని సూచించారు. అదేవిధంగా, ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అదిలాబాద్  వైస్ చైర్మన్ రోహిత్,ఆసిఫాబాద్  మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ సాజిద్  అహ్మద్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ యునుస్ ఆక్బని ఎండీ అహ్మద్‌కు శాలువా కప్పి ఘనంగా అభినందనలు తెలియజేశారు.