ఆగస్టు 2 వరకు అసెంబ్లీ సమావేశాలు
24-07-2024 09:46 PM
హైదరాబాద్: బీఏసీ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టానున్నారు. ఈనెల 26న అసెంబ్లీకి సెలవు ఉండగా, 27న బడ్జెట్ పద్దుపై చర్చ జరుగగా, 28న ఆదివారం అసెంబ్లీ సెలవు దినంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 29,30వ తేదీల్లో వివిధ బిల్లులు, 31న రాష్ట్ర అప్రాప్రియేషన్ బిల్లు, ఆగస్టు 1,2వ తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నది.






