24-07-2024 10:05:37 PM
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దీంతో తీర్మానాని సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం సభను వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
ప్రతి కేంద్ర పథకంలో తెలంగాణకు వాటా ఉందని, పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుల కంటే కేంద్రం నిధులే ఎక్కువగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం నిధులివ్వకుంటే... గతంలో కాంగ్రెస్ ఏనాడైనా ఉద్యమాలు చేసిందా?, కేంద్ర నిధుల్లేకుండా గ్రామ పంచాయతీలు అభివృద్ధి అవుతున్నాయా? అని బండి ప్రశ్నించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.